కాంట్రాక్ట్ టీచర్లుగా 2008 డీఎస్సీ అభ్యర్థులు
విద్యారణ్యపురి: 2008 డీఎస్సీలో క్వాలిఫై అయిన బీఈడీ అభ్యర్థులను అప్పట్లో ఎస్‌జీటీలుగా ఎంపిక చేయలేదు. దీంతో వారు కొన్నేళ్లుగా తమను టీచర్లుగా నియమించాలని కోరుతూ వస్తున్నారు. ఎట్టకేలకు సర్కారు కరుణ చూపింది. కాంట్రాక్ట్ టీచర్లుగా నియమించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలో 182మంది అభ్యర్థులు ఉండగా, వీరికి శనివారం ఆయా జిల్లాకేంద్రాల్లోని డీఈఓ కార్యాలయాల్లో నియామకపత్రాలు అందించనున్నారు.
ఇటీవల సర్టిఫికెట్ల వెరిఫికేషన్
2008 డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఇటీవల హనుమకొండ డీఈఓ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 295మంది అభ్యర్థులకుగాను 182మంది సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఎంపికై న వారు శనివారం తమ ఒరిజనల్ విద్యార్హతల సర్టిఫికెట్లతో కేటాయించిన జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి వెళ్లాలి. సర్టిఫికెట్లను మరోసారి పరిశీలించి డీఈఓల చేతుల మీదుగా కాంట్రాక్ట్ ఎస్‌జీటీగా నియామక పత్రాలు అందించనున్నారు.
నెలకు రూ.31,040 వేతనం
కాంట్రాక్ట్ టీచర్లుగా నియమితులైనవారికి నెలకు రూ,31,040 వేతనం ఇవ్వనున్నారు. నియమ నిబంధనల ప్రకారం రూ.100 బాండ్ పేపర్ సమర్పించాలి. ఆ తరువాత కేటాయించిన పాఠశాలలో విధులకు హాజరుకావాల్సి ఉంటుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 182మంది ఎస్‌జీటీలుగా ఎంపిక
నేడు డీఈఓ కార్యాలయాల్లో
నియామక పత్రాలు అందజేత
జిల్లాల వారీగా అభ్యర్థులు ఇలా..
వరంగల్ 08
హనుమకొండ 18
జేఎస్ భూపాలపల్లి 43
ములుగు 28
మహబూబాబాద్ 52
జనగామ 33
Comments
Please login to add a commentAdd a comment