అందరి సహకారంతో విజయవంతం: కలెక్టర్ దివాకర
అన్ని శాఖల అధికారుల సమన్వయంతోనే మేడారం జాతర విజయవంతమైందని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. శుక్రవారం మేడారంలోని ఐటీడీఏ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. మినీ జాతరకు వచ్చిన భక్తులతో మేడారం సందడి వాతావరణం సంతరించుకుందన్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాల కు గురికాకుండా అన్ని ఏర్పాట్లు కల్పించామన్నారు. ఈనెల 16న (ఆదివారం) సెలవు రోజు భక్తుల వేలాది తరలివస్తారనే అంచనాతో అప్పటి వరకు కావాల్సిన ఏర్పాట్ల కూడా చేశామన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల భద్రత చర్యల కోసం పోలీసులు చర్యలు చేపట్టారన్నారు. జాతర కవరేజ్ చేసి స హకరించిన మీడియాకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపా రు. ముందుగా కలెక్టర్ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సాంప్రదాయంగా దేవాదాయ శాఖ అధికారులు, పూజారులు కలెక్టర్‌కు స్వాగతం పలికి దగ్గరుండి దర్శనం చేయించి అమ్మవార్ల ప్రసాదం అందించారు. కలెక్టర్ వెంట ఈఓ రాజేంద్రం, మంగపేట తహసీల్దార్ రవీందర్, డీటీ సురేష్‌బాబు, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment