సన్నా, దొడ్డు రకం ధాన్యం వేర్వేరుగా సేకరించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): సన్నరకం, దొడ్డురకం ధాన్యం కొనుగోలుకు వేర్వేరుగా కౌంటర్లు, కాంటాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం వానాకాలం 2024–25 ధాన్యం సేకరణ, డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన, నియామకం ఆర్డర్ల జారీ అంశాలపై రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా అధికారులతో వీసీ నిర్వహించారు. వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి సన్నరకం ధాన్యానికి అదనంగా రూ.500 బోనస్ ఇస్తున్నందున, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తీసుకురాకుండా రాష్ట్ర సరిహద్దుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. డీఎస్సీకి సంబంధించి ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను రెండు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. జనవరి నుంచి రేష న్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వీసీలో కలెక్టర్ విజయేందిర, ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment