రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటి పతకాలు సాధించాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేశ్ అన్నారు. వరంగల్‌లో ఈనెల 7, 8 తేదీల్లో జరిగే 10వ రాష్ట్రస్థాయి (అండర్–14, 16, 18, 20 ఏళ్లలోపు) అంతర్ జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను గురువారం జిల్లాకేంద్రంలో మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జెండా ఊపి ఎంపికలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని కోరారు. పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరతచంద్ర మాట్లాడుతూ ఎంపికలకు జిల్లావ్యాప్తంగా దాదాపు 100 మంది బాలబాలికలు హాజరైనట్లు తెలిపారు. అండర్–14, 16, 18, 20 విభాగాలకు సంబంధించి 60 మీ., 100 మీ., 200మీ., 400మీ., 600 మీ., 800మీ., 1,000 మీ., 1,500మీ., 3,000 మీ., 5,000 మీ., 10,000 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, హైజంప్, బ్యాక్‌త్రో, షాట్‌పుట్, జావెలిన్ త్రో, హార్డిల్స్, తదితర అంశాల్లో ఎంపికలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి పుట్టి సురేష్‌చందర్, కోచ్‌లు ఆనంద్, సునీల్, సాధి క్‌అలీ, పీడీలు రమేష్‌బాబు, సి.శ్రీనివాసులు, రాజు, పి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment