నిలిచిన నెట్టెంపాడు నీటి పంపింగ్
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. శుక్రవారం సాయంత్రం ప్రాజెక్టుకు 25వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. జెన్‌కో జల విద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్లను కొనసాగించి విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఇందుకోసం ప్రాజెక్టు నుంచి 21,919 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం నీటి పంపింగ్‌ను నిలిపివేశారు. భీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 72 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,140 క్యూసెక్కులు, కుడి కాల్వకు 730 క్యూసెక్కులు, ఆర్‌డీఎస్ లింక్ కెనాల్‌కు 50 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 700 క్యూసెక్కులు, భీమా లిఫ్టు – 2కు 750 క్యూసెక్కులు మొత్తం ప్రాజెక్టు నుంచి 25,231 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.604 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
శ్రీశైలంలో నీటిమట్టం 880.9 అడుగులు
దోమలపెంట: శ్రీశైలం జలాశయంలో శుక్రవారం నీటిమట్టం 880.9 అడుగుల వద్ద 192.9694 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాల, సుంకేసుల నుంచి మొత్తం 28,629 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలంలో ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 21,189 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా 20,000 క్యూసెక్కులు, ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు 1,510, రేగుమాన్‌గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకు 1,600 క్యూసెక్కుల నీటని విడుదల చేశారు. ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో 15.390 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు.
జూరాలకు 25 వేల
క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
సుంకేసులకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
రాజోళి: సుంకేసుల డ్యాంకు ఎగువ నుంచి స్వల్ప ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. శుక్రవారం ఎగువ నుంచి 9,540 క్యూసెక్కుల రాగా..రెండు గేట్లను తెరిచి 6,710 క్యూసెక్కులు వదులుతున్నారు. అలాగే 2,445 క్యూసెక్కులు కేసీ కెనాల్‌కు వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment