ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
కేటీదొడ్డి: ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లల బంగారు భవిష్యత్‌కు పునాది పడుతుందని, తల్లిదండ్రులు పిల్లలను సర్కారు బడికి పంపాలని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. శుక్రవారం మండలంలోని మల్లాపురంలో బడిబయట పిల్లలపై తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతోపాటు విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఉమ్మడి గట్టు, కేటీదొడ్డి మండలంలో విద్యాపరంగా వెనకబడ్డాయని, వచ్చే ఏడాదిలోగా చదువులో ముందుకు వెళ్లేలా చర్యలు తీసకోవాలని సూచించారు. సమావేశంలో ఎంవీఎఫ్ ఫౌండేషన్ వెంకట్‌రెడ్డి, జిల్లా సమన్వయకర్త హంపయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment