రోడ్లపై ధాన్యంఆరబెట్టవద్దు: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలోని అంతర్రాష్ట్ర రహదారులతో పాటు ఇతర రోడ్లపై ధాన్యాన్ని పోసి ఇతరుల మరణానికి కారణం కావ్వొద్దని ఎస్పీ డి.జానకి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్లపై ధాన్యం పోసి కవర్లు కప్పడం వల్ల రాత్రివేళ వాహనదారులు గుర్తించక ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయని తెలిపారు. సాధ్యమైనంత వరకు రోడ్లపై ధాన్యం ఆరబెట్టవద్దని రైతులకు సూచించారు. వ్యవసాయ పొలాలు లేదా ఇళ్ల వద్ద, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టుకోవాలన్నారు. రోడ్లపై ధాన్యం పోయకుండా పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఎవరైనా నిర్లక్ష్యంగా రోడ్లపై ధాన్యం పోస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
డీఎంహెచ్‌ఓబాధ్యతల స్వీకరణ
పాలమూరు: జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిగా డా. కృష్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కలెక్టర్ విజయేందిర బోయిని ఆయన మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇక్కడ డీఎంహెచ్‌ఓగా పనిచేసిన డా. పద్మ హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి డా.కృష్ణ బదిలీపై వచ్చారు. గతంలో ఆయన జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిగా పనిచేశారు. తక్కువ సమయంలోనే మళ్లీ జిల్లాకు రావడం విశేషం. ఈ సందర్భంగా డా.కృష్ణ మాట్లాడుతూ.. జిల్లాలో ఆరోగ్యశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయడంతో పాటు అన్ని రకాల ప్రోగ్రామ్స్ బలోపేతం చేయడాకి కృషి చేస్తామని తెలిపారు.
జట్ల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల మైదానంలో సోమవారం ఎస్‌జీఎఫ్ అండర్–19 ఉమ్మడి జిల్లా బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపికలు నిర్వహించారు. ముందుగా ప్రిన్సిపాల్ వాణి సరళ, వైస్ ప్రిన్సిపాల్ సావిత్రమ్మ క్రీడాకారులను పరిచయం చేసుకొని ఎంపికలను ప్రారంభించారు. త్వరలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని వారు ఆకాంక్షించారు. ధన్వాడ ప్రిన్సి పాల్ అబ్దుల్ ముజీబ్, వ్యాయా మ ఉపాధ్యాయులు నాగరాజు, రాఘవేందర్, నాగమణి, సుగుణ, కపిల్, సునీతపాల్గొన్నారు.
బాదేపల్లి మార్కెట్‌కు పోటెత్తిన మొక్కజొన్న
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు మొక్కజొన్న పోటెత్తింది. సోమవా రం వివిధ ప్రాంతాల నుంచి రైతులు 8,490 క్వింటాళ్ల మొక్కజొన్నను అమ్మకానికి తీసుకురావడంతో యార్డు ఆవరణ కిక్కిరిసి పోయింది. ఈ సీజన్‌లో ఇంత పెద్ద మొత్తంలో మొక్కజొన్న రావడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. క్వింటాల్ గరిష్టంగా రూ. 2,482, కనిష్టంగా రూ. 1,764 ధరలు వచ్చా యి. హంస ధాన్యం రూ. 2,116, ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ. 2,436, కనిష్టంగా రూ. 1,728, ఆముదాలు రూ. 5,719, రాగులు రూ. 2,222ఽ. వేరుశనగ రూ. 4,351 ధరలు లభించాయి.
హాకీ సౌత్‌జోన్ జట్టు ఎంపికలు వాయిదా
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ (పీయూ) తరఫున సౌత్ జోన్ హాకీ జట్టు ఎంపికలను వాయిదా వేస్తున్నట్లు పీడీ డా.వై.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు ఈనెల 6వ తేదీకి బదులు 15న నిర్వహించనున్నామని పేర్కొన్నారు. 17–25 ఏళ్లలోపు కలిగిన క్రీడాకారులు ఇందులో పాల్గొనేందుకు అర్హులని, ప్రస్తుతం చదువుతున్న బోనఫైడ్‌తో పాటు పదోతరగతి మెమోతో హాజరు కావాలని సూచించారు. ఎంపికై న జట్టు తమిళనాడులోని డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ పోటీలలో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు.
నేడు మెగా వైద్య శిబిరం
పాలమూరు: సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ఎస్వీఎస్ హాస్పిటల్స్ సౌజన్యంతో మంగళవారం ఉదయం 9 గంటలకు జిల్లాకేంద్రంలోని పారిశ్రామికవాడ సీనియర్ సిటిజన్ ఫోరం కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఫోరం అధ్యక్షుడు జగపతిరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య శిబిరంలో కార్డియాలజీ, ఆప్తాల జీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, మధుమేహం, గైనకాలజిస్ట్, బీపీ తదితర వాటికి పరీక్షలు నిర్వహించి సూచనలు చేస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment