మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి పోటాపోటీ నెలకొంది. బీసీ మహిళకు రిజర్వుడు అయిన ఈ పదవికి బీఆర్‌ఎస్‌కు చెందిన అభ్యర్థి మాత్రమే ఎన్నికయ్యే అవకాశం ఉంది. అయితే బీఆర్‌ఎస్‌లోని ఆశావహులు చీలి కాంగ్రెస్, బీజేపీ మద్దతుతో చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. బీఆర్‌ఎస్‌లో బీసీ మహిళా కౌన్సిలర్లు ఐదుగురు ఉన్నా ప్రధాన పోటీ మాత్రం ఇద్దరి మధ్యే నెలకొంది. మరి మున్సిపల్ పీఠం చివరికి ఎవరికి దక్కుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. కాగా ఇప్పటికే మున్సిపల్ పాలన అవినీతిమయంగా మారిందని, ఇప్పటికై నా అవినీతి మరకలు అంటని సభ్యురాలిని చైర్‌పర్సన్‌గా ఎన్నుకోవాలని పట్టణ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment