స్వీయ రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: స్వీయ రక్షణ కోసం కరాటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లాకేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ఏఆర్ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ రవినాయక్ ఆధ్వర్యంలో ఆదివారం ఇంటర్ స్టేట్ ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి దాదాపు 400 మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కుమితే, కతాస్, టీం కతాస్ తదితర అంశాల్లో పోటీలు జరగగా.. విద్యార్థులు ఉత్సాహంగా పా ల్గొని పతకాలు సాధించారు. కరాటే చాంపియన్‌షిప్‌ను డీఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి మాట్లాడారు. కరాటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల దేహదారుఢ్యంతోపాటు మానసికంగా ఎదగవచ్చన్నారు. నిహాన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే ఆర్గనైజేషర్ ఇండియా చీఫ్ వి.రవీందర్‌కుమార్ మాట్లాడుతూ కరాటేకు ప్రస్తుతం ఎంతో ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. కరాటే నేర్చుకోవడం వల్ల చదువులో కూడా ముందుంటారన్నారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి కరాటే టోర్నీలో రాణించాలని కోరారు. అనంతరం టోర్నీలో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ రవినాయక్, కరాటే మాస్టర్లు రవికుమార్, ఎంఎన్ విజయ్‌కుమార్, ఆయా రాష్ట్రాల మాస్టర్లు రాజేష్ (కర్ణాటక), విజయ్ (ఆంధ్రప్రదేశ్), షాహిన్ అన్సారీ (బీహార్) తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment