ప్రజాపాలన కళాయాత్ర ప్రారంభం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): {ç³gê ÑfÄñæ*-™èlÞÐéÌZÏ ¿êVýS…V> Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… MýSÌñæ-MýStÆó‡sŒæ BÐ]l-Æý‡×æÌZ {ç³gê-´ëÌS¯]l MýSâêĶæ*-{™èl¯]l$ Ayìl-çÙ¯]lÌŒæ MýSÌñæ-MýStÆŠ‡ Ððl*çßæ-¯ŒSÆ>Ð]l# gñæ…yé Fí³ {´ëÆý‡…-À…-^éÆý‡$. ™ðlÌS…-V>×æ Ýë…çÜP–-†MýS MýSâê-M>-Æý‡$Ë$ ¯]lÐ]l…-ºÆŠ‡ 19 ¯]l$…_ yìlòÜ…-ºÆŠ‡ 7 Ð]lÆý‡MýS$ {糆 Æøk 3 {V>Ð]l*ÌZÏ {糿¶æ$™èlÓ çÜ…„óSÐ]l$ ç³£ýl-M>¯]l-ÌSOò³ {ç³^éÆý‡… MýS͵…-^èl-¯]l$-¯]l²r$Ï ™ðlÍ-´ëÆý‡$. {糿¶æ$™èlÓ… AÐ]l$Ë$ ^ólçÜ$¢¯]l² çÜ…„óSÐ]l$ ç³£ýl-M>ÌS¯]l$ ÑÐ]l-ÇçÜ*¢ {ç³^éÆý‡… M>Æý‡☻Å-{MýSÐ]l*°² °Æý‡Ó-íßæ…^èl-¯]l$-¯]l²r$Ï õ³ÆöP-¯é²Æý‡$. M>Æý‡Å-{MýSÐ]l$…ÌZ yîlï³-BÆŠ‡K }°-Ðé‹Ü, MýSÌñæMýSt-Æó‡sŒæ HK Ôèæ…MýSÆŠæ, C™èlÆý‡ A«¨-M>Æý‡$-Ë$-´ëÌŸY-¯é²Æý‡$. ☻
నేడు దివ్యాంగులకుక్రీడాపోటీలు
మహబూబ్‌నగర్ రూరల్: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా స్టేడియం గ్రౌండ్‌లో దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారి జరీనాబేగం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, పురుషుల్లో అంధులకు చెస్, పరుగు పందెం, షాట్‌పుట్, శారీరక దివ్యాంగులకు ట్రై సైకిల్, వీల్‌చైర్, క్యారమ్స్, బధిరులకు పరుగుపందెం, షాట్‌పుట్, క్యార మ్స్ వంటి క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జూనియర్ విభాగంలో 10 –17 వయసు గల వారికి, సీనియర్ విభాగంలో 18–54 వయసు గల వారికి వేర్వేరుగా పోటీ లు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు బుధవారం ఉదయం 9 గంటలకు జిల్లా స్టేడి యం గ్రౌండ్‌కు ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్‌లతో వచ్చి తమ పేర్లు నమోదు చేసుకుని క్రీడాపోటీల్లో పాల్గొనవచ్చని సూచించారు.
నేడు సర్టిఫికెట్ల పరిశీలన
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్–4 పరీక్షలో ఎంపికై రెవెన్యూ శాఖకు కేటాయించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను బుధవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో పరిశీలించనున్నట్లు అడిషనల్ కలెక్టర్ మోహన్‌రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికై న 38 మంది అభ్యర్థులకు సమాచారం ఇచ్చామని, వారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు మూడుసెట్ల అటెస్టెడ్ జిరాక్స్ కాపీలను తీసుకొని రావాలని సూచించారు.
నేడు ‘కురుమూర్తి’కిమాజీ మంత్రి హరీశ్‌రావు
దేవరకద్ర: చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌లోని కురుమూర్తిస్వామి దేవాలయానికి బుధవారం మాజీ మంత్రి హరీశ్‌రావు రానున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆయన ఆలయం వద్దకు చేరుకుంటారు. కురుమూర్తిస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం స్థానిక విలేకరుల సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. హరీశ్‌రావు వెంట మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీలు, చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్‌కుమార్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. హరీశ్‌రావు పర్యటన నేపథ్యంలో అధికార పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనగా.. ఇప్పుడు బీఆర్‌ఎస్ తరఫున మాజీ మంత్రి వస్తుండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మొక్కజొన్న క్వింటాల్ రూ.2,417
దేవరకద్ర/జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి 6,826 క్వింటాళ్ల ధాన్యం, 1,520 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి వచ్చింది. మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,417, కనిష్టంగా రూ.1,901 ధరలు లభించాయి. ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ రకం గరిష్టంగా రూ.2,711, కనిష్టంగా రూ.1,460, హంస రకం గరిష్టంగా రూ.2,220, కనిష్టంగా రూ.1,851, సోనామసూరి రూ.1,464, రాగులు గరిష్టంగా రూ.3,029, కనిష్టంగా రూ.2,100 పలికాయి. వేరుశనగ గరిష్టంగా రూ.6,380, కనిష్టంగా రూ.5,069 ధరలు దక్కాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,509, కనిష్టంగా రూ.1,950, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,912గా ఒకే ధర పలికింది. మార్కెట్‌కు దాదాపు 2,500 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment