పాలమూరులో ప్రజాపాలన విజయోత్సవాలు
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని శిల్పారామంలో మంగళవారం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సంగీత, నాటక అకాడమీ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ అలేఖ్య పుంజల బృందం స్కిట్ ప్రదర్శన ఆకట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై నాటక రూపంలో ప్రదర్శించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అవగాహన కల్పించేలా చక్కటి నాటకాన్ని 0ప్రదర్శించారు. ఈ విజయోత్సవాల్లో ముఖ్య అథిగా పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని న్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసి చూపించిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి వచ్చే నెల 7వ తేదీ నాటికి ఏడాది పూర్తవుతుందన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి 48 గంటల్లో ఆరు గ్యారంటీల్లో రెండింటిని అమలు చేసినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 50 వేల మందికి నియామక ఉత్తర్వులు అందజేశామన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులను భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రాష్ట్ర జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు తెలిపారు. కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి పూర్తి అవుతున్న సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. పిల్లలు, మహిళలు, యువత, వృద్ధులతో పాటు అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావు, టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్, మార్కెట్ చైర్మన్ బెక్కరి అనిత తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలపై అలరించిన ప్రదర్శన
ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి: జీఎమ్మార్
Comments
Please login to add a commentAdd a comment