సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించాలి
మహబూబ్‌నగర్ క్రైం: పోలీస్ నిత్యం శిక్షణతో పాటు సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి విషయాలపై అధికంగా దృష్టి సారించాలని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ అన్నారు. జిల్లాకేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం వార్షిక తనిఖీ నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ పని తీరు, ప్రజలతో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తున్నారు? శాంతి భద్రత వంటి అంశాలపై సమీక్షించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులతో పాటు ఇతర ఎఫ్‌ఐఆర్‌ల నమోదు ప్రక్రియపై ఆరా తీశారు. పలు రకాల కేసుల ఫైల్స్ రికార్డులు తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌ల పనితీరును మెరుగుపరుచుకోవడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో పని చేయాలన్నారు. అనంతరం రూరల్ సర్కిల్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. సర్కిల్ పరిధిలో ఉన్న పెండింగ్ కేసులపై సమీక్షించారు. ఎస్పీ కార్యాలయంలోని సాయుధ దళాల కార్యాలయంలో పలు రకాల రికార్డ్స్, స్పెషల్ బ్రాంచ్ రికార్డులు, డీసీఆర్‌బీ రికార్డ్స్, పరిపాలన విభాగాల రికార్డులను సైతం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ డి.జానకికి డీఐజీ పలు సూచనలు చేశారు. తనిఖీల్లో ఏఎస్పీలు రాములు, సురేష్‌కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, సీఐలు అప్పయ్య, గాంధీనాయక్ పాల్గొన్నారు.
జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్
Comments
Please login to add a commentAdd a comment