ఆర్‌అండ్‌ఆర్ పనుల్లో వేగం పెంచాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆర్‌అండ్‌ఆర్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను దేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పాలమూరు ఎత్తిపోతల పథకంలోని ఆర్‌అండ్‌ఆర్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఇంజినీరింగ్ అధికారులు అంతర్గత రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, మిషన్ భగీరథ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావు, స్పెషల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
మరుగుదొడ్డిని వాడేలా అవగాహన కల్పించాలి
ప్రతి ఒక్కరూ కచ్చితంగా మరుగుదొడ్డిని వాడేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ విజయేందిర సూచించారు. ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో మన మరుగుదొడ్డి–మన గౌరవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఈ నెల 19వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా గ్రామాలు, మండలాలలో ప్రపంచ మరుగుదొడ్డి సంబరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి కచ్చితంగా మరుగుదొడ్డి ఉండేలా చర్యలు తీసుకోవాలని, స్కూల్, అంగన్‌వాడీలు, గ్రామ పంచాయతీల్లో మరుగుదొడ్లు కచ్చితంగా ఉండాలన్నారు. ఓడీఎఫ్ ప్రకటించాల్సిన 78 మోడల్ గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ చూపిన 14 మంది మల్టీపర్పస్ వర్కర్స్‌ను కలెక్టర్ సన్మానించారు. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరైన 25 మంది లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నర్సిములు, డీపీఓ పార్థసారథి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment