విద్యార్థులు జాతీయస్థాయిలో రాణించాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో విద్యార్థులు రాణించాలని డీఈఓ ప్రవీణ్‌కుమార్ అన్నారు. జిల్లాకు చెందిన పి.జయవర్ధన్‌రెడ్డి (అపెక్స్ సెంట్రల్ స్కూల్, మహబూబ్‌నగర్), పి.లాస్యప్రియ (మహబూబ్‌నగర్ హైస్కూల్) విద్యార్థులు జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14 హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం డీఈఓ విద్యార్థులను అభినందించారు. ఇటీవలే హుస్నాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–14 ఎస్‌జీఎఫ్ హ్యాండ్‌బాల్ టోర్నీలో ప్రతిభ చాటారు. చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో ఈనెల 25నుంచి 29వరకు జాతీయస్థాయి పోటీలు జరుగుతాయి. సీఎంఓ బాలు, జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి, పీడీ వేణుగోపాల్, మహబూబ్‌నగర్ హైస్కూల్ ప్రిన్సిపాల్ శాంత, ఎండీ.జియావుద్దీన్, అహ్మద్ హుస్సేన్, శివుడు తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ ప్రవీణ్‌కుమార్
హ్యాండ్‌బాల్ పోటీలకు జిల్లా విద్యార్థులు ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment