కాటన్‌మిల్లులో అగ్నిప్రమాదం
తెలకపల్లి: మండలంలోని రాంరెడ్డిపల్లి, చిన్నముద్దునూరు గ్రామాల మధ్య ఉన్న వినాయక కాటన్‌మిల్లులో శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాటన్‌మిల్లు నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం మిల్లులో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. అప్పటికే ప్రమాదంలో మిషన్లు, సెల్టార్లు, బెల్టులు, కొంత మేరకు పత్తి కాలిపోయాయి. ప్రమాదంలో దాదాపు రూ.20 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు నిర్వాహకులు తెలిపారు.
రూ.లక్ష నష్టం
గద్వాల క్రైం: పత్తి మిల్లులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈసంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గద్వాల–మెలచెర్వు రోడ్డు మార్గంలోని వీరన్నగౌడు పత్తి మిల్లులో పత్తిని కూలీలు మిషన్ ద్వారా వేరు చేస్తున్నారు. ఈ తరుణంలో వేడి ధాటికి నిప్పురవ్వలు వచ్చాయి. పత్తి కాటన్లపై నిప్పురవ్వలు పడటంతో మంటలు వ్యాపించాయి. క్షణాల్లో కూలీలు, మిల్లు వర్కర్స్ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. రూ.లక్ష మేర నష్టం వాటిల్లినట్లు మిల్లు యజమాని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment