రాష్ట్రస్థాయిలో చాంపియన్‌గా నిలవాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ టోర్నీలో ఉమ్మడి జిల్లా సబ్ జూనియర్ బాలుర జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి చాంపియన్‌గా నిలవాలని జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి జి.శరత్చంద్ర అన్నారు. మెదక్ జిల్లా మూసాయిపేటలో శని, ఆదివారం జరిగే సబ్ జూనియర్ బాలుర రాష్ట్రస్థాయి అంతర్జిల్లా సాఫ్ట్‌బాల్ టోర్నీలో పాల్గొనేందుకు ఈ జట్టు శుక్రవారం సాయంత్రం తరలివెళ్లింది. ఈ సందర్భంగా జట్టును ఆయన అభినందించారు. కార్యక్రమంలో కోచ్ సాదిక్‌అలీ, పీడీలు నాగరాజు, రాఘవేందర్, నాగమణి, సుగుణ, మేరిపుష్ప, జంగయ్య పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా సబ్ జూనియర్ బాలుర జట్టు
ఎస్.సందీప్, వై.రంజిత్, ఎల్.అరవింద్, వి.ఓంకార్, గోపిచందు, కె.ఉదయ్‌కిరణ్, వి.శివకుమార్, రాజేందర్, వి.కార్తీక్, సిద్దార్థ్, జుబేర్, కె.సందీప్, సాయిచరణ్, ఎ.చరణ్, వర్షిత్, జి.నాగరాజు. కోచ్, మేనేజర్లుగా కిరణ్, శ్రీను, మోహన్ వ్యవహరిస్తున్నారు.
జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి
జి.శరత్చంద్ర
మూసాయిపేట తరలిన సాఫ్ట్‌బాల్ జట్టు
Comments
Please login to add a commentAdd a comment