అధికారుల నిర్లక్ష్యమే కారణం | - | Sakshi
Sakshi News home page

అధికారుల నిర్లక్ష్యమే కారణం

Published Sat, Nov 23 2024 12:49 AM | Last Updated on Sat, Nov 23 2024 12:49 AM

అధికా

అధికారుల నిర్లక్ష్యమే కారణం

అధికారుల నిర్లక్ష్యం.. పర్యవేక్షణ కరువైంది. దీంతో మా పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి తీవ్ర అనారోగ్యం పాలయ్యాను. అక్కడ పాలకూరలో కుళ్లిన కోడిగుడ్లు వేసి వండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇక్కడ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఇంకా కడుపునొప్పితో బాధ పడుతున్నాను. ఈ పెద్దాస్పత్రిలో మెనూ ప్రకారం భోజనం సరిగా వడ్డించడం లేదు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు.

– నందిని (కొత్తపల్లి), జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థి, మాగనూరు

కళ్లు తిరిగినట్లవుతోంది..

మా పాఠశాలలో బియ్యం కడగకుండానే కచిబిచి వంట చేసేవారు. ఇదేమని అడిగితే ఏమీ కాదులే అని వంట ఏజెన్సీ వారు బదులిచ్చేవారు. చివరకు మధ్యాహ్నం భోజనం వికటించడంతో ఆస్పత్రి పాలయ్యాను. కడుపునొప్పి, దగ్గు విపరీతంగా వస్తోంది. ఏమీ తినబుద్ది కావడం లేదు. కళ్లు తిరిగినట్లవుతోంది. ఈ ఆస్పత్రిలోనూ పద్ధతి ప్రకారం మెనూ పాటించడం లేదు.

– అనిల్‌ (ఉజ్జెల్లి), జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థి, మాగనూరు

No comments yet. Be the first to comment!
Add a comment
అధికారుల నిర్లక్ష్యమే కారణం 
1
1/1

అధికారుల నిర్లక్ష్యమే కారణం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement