మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శుక్రవారంపూర్తిస్థాయి నీటిమట్టం 1,021అడుగులకు చేరింది. జూరాల ఎడమకాల ద్వారా 390 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. సమాంతర కాలువ ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారు. ఎన్టీఆర్ కాలువ ద్వారా 800 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువల ద్వారా 25 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని ఏఈ వర ప్రాసాద్ తెలిపారు.
ఒక గేటు ద్వారా నీటి విడుదల
రాజోళి: సుంకేసుల డ్యాంలో ఒక గేటు ద్వారా నీటి విడుదల చేస్తున్నట్లు జేఈ మహేంద్ర తెలిపారు. శుక్రవారం ఎగువ నుంచి 3813 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో రాగా.. 1,368 క్యూసెక్కులు దిగువకు వదిలి కేసీ కెనాల్‌కు 2,445 క్యూసెక్కులు వదిలినట్లు ఆయన పేర్కొన్నారు.
జూరాలకు స్వల్ప వరద
ధరూరు : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శుక్రవారం ప్రాజెక్టుకు 3,500క్యూసెక్కులు ఉన్నాయి. ఆవిరి రూపంలో 72క్యూసెక్కులు, ఎడమ కాలువకు 390 క్యూసెక్కులు, కుడి కాలువకు 54 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 630 క్యూసెక్కులు, ఆర్‌డీఎస్ లింక్ కెనాల్‌కు 100 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం1,166 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 9.542 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment