విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
జడ్చర్ల టౌన్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో జడ్చర్లలో నిర్వహిస్తున్న అండర్–19 బాల బాలికల ఫుట్‌బాల్ రాష్ట్ర టోర్నీని సోమవారం ఆయన ప్రారంభించారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డితో కలసి క్రీడకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థుల కోసం త్వరలోనే క్రీడాపాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జడ్చర్ల స్టేడియం మైదానంలో సింథటిక్ ట్రాక్ కోసం రూ.9కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఇండోర్‌స్టేడియం తీసుకువస్తానని, రాబోయే రోజుల్లో స్టేడియంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు ఎంఈఓ మంజులాదేవి, మున్సిపల్ చైర్‌పర్సన్ పుష్పలత, డీఐఈఓ కౌసర్‌జహా, డీవైఎస్‌ఓ శ్రీనివాస్, తెలంగాణ ఫిజికల్ డైరెక్టర్ అసోసియేషన్, పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు నిరంజన్తోపాటు పర్యవేక్షకులు రాము, ప్రసాద్, కౌన్సిలర్లు సతీష్, రఘురాంగౌడ్, రమేష్, పీడీలు పాపిరెడ్డి, మోయిన్, విలియం, శారదబాయి, పీఈటీ కృష్ణ, రాము, శ్రీను, భానుకిరణ్ పాల్గొన్నారు.
హోరాహోరీగా టోర్నీ
టోర్నీలో భాగంగా మొదటిరోజున బాలుర 5, బాలికల 5 మ్యాచ్‌లు జరిగాయి. ఆతిథ్య జట్టు బాలుర విభాగంలో రంగారెడ్డితో తలపడి డ్రాచేసుకుంది. బాలికల విభాగంలో రంగారెడ్డి జట్టుతో ఓటమి పాలయ్యింది.
టోర్నీలో పాల్గొంటున్న జట్లు
త్వరలో క్రీడా పాఠశాలలు ఏర్పాటు
ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
అండర్–19 రాష్ట్ర ఫుట్‌బాల్ టోర్నీ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment