తుది దశకు కొనుగోళ్లు
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): వానాకాలం సీజన్ వరిధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు వచ్చాయి. ఈ నెలాఖరు వరకే కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కోసం 189 కేంద్రాలను ప్రారంభించగా.. ఇప్పటికే 42 కేంద్రాలను మూసేయగా.. 147 కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 77,900 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 16,191 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన ఈ ధాన్యం విలువ రూ.180.79 కోట్లు కాగా, ఇప్పటికే 13,012 మంది రైతుల ఖాతాల్లో రూ. 151.04 కోట్లు జమ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 52,660 మెట్రిక్ టన్నుల ధాన్యం సన్నరకం కాగా, 24,700 మెట్రిక్ టన్నుల ధాన్యం దొడ్డు రకం రకానికి చెందినది. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరి ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ను ప్రకటించింది. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన సన్నరకం వరి ధాన్యానికి రూ.12.44 కోట్ల బోనస్‌ను చెల్లించారు.
● మరో 10 రోజుల వరకు విక్రయాలు జరిగే అవకాశం
● ఇప్పటికే 42 కొనుగోలు కేంద్రాలు మూసివేత
● 147 కేంద్రాల్లో కొనసాగుతున్న కొనుగోళ్లు
● రైతుల నుంచి సేకరించిన వరి ధాన్యం 77,900 మెట్రిక్ టన్నులు
● దళారులకు విక్రయించేందుకేఅన్నదాతల మొగ్గు
Comments
Please login to add a commentAdd a comment