మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్‌కాలనీ (వార్డు నం.48)లో కొనసాగుతున్న ఈ సర్వేను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బృందానికి క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా మొబైల్ యాప్‌లో నమోదు చేయాలన్నారు. అలాగే ‘ప్రజాపాలనశ్రీలో దరఖాస్తు చేసుకున్న వారు తమ పూర్తి వివరాలను డాక్యుమెంట్లతో సహా సర్వే బృందాలకు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం స్థానిక రైల్వేస్టేషన్‌కు సమీపంలో టాస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. దీనిని వీలైనంత త్వరగా ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు దిగ్గజ సంస్థలలో ఉద్యోగావకాశాలు కల్పించడానికి అవసరమైన నైపుణ్యాలు, ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడటం, మౌఖిక పరీక్షలు ఎదుర్కొనేలా ఇక్కడ తర్ఫీదు ఇప్పిస్తామన్నారు. ముఖ్యంగా టెక్నికల్, నాన్–టెక్నికల్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి, టాస్క్ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశం
స్కిల్ సెంటర్ ప్రారంభానికి ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment