27న జాబ్‌మేళా
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీన స్థానిక కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మైత్రి ప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మూడు ప్రైవేట్ సంస్థల్లో 400 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఈ మేళాకు జిల్లాలో ఉన్న నిరుద్యోగులు హాజరు కావాలని కోరారు. వివరాల కోసం 9948568830, 9550205227, 9175305435 నంర్లను సంప్రదించాలని సూచించారు.
చైతన్యంతోనే వినియోగదారుల హక్కుల పరిరక్షణ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజల్లో చైతన్యంతోనే వినియోగదారుల హక్కుల పరిరక్షణ సాధ్యమని రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి సంవత్సరం ఒక అంశంతో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు, ఈ సంవత్సరం ‘డిజిటల్ విధానం, వర్చువల్ విచారణల ద్వారా వినియోగదారుల న్యాయం’ అనే అంశంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ యుగంలో ఏవిషయమైనా తొందరగా వ్యాపిస్తుందన్నారు. ప్రజల బలహీనతలతో వ్యాపారులు వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం కన్వీనర్ బాలలింగయ్య మాట్లాడుతూ హక్కులతో పాటు బాధ్యతలు గుర్తించాలన్నారు. నాణ్యమైన వస్తువు కొనాలని, నష్టపోతే పరిహారం పొందే హక్కు ఉంటుందని అన్నారు. రాష్ట్ర పుడ్ సేఫ్టీ కమిషన్ మాజీ సభ్యుడు ఆడమ్స్ మాట్లాడుతూ వినియోగదారుల పరిరక్షణ చట్టం వినియోగదారుల పక్ష పాతి అని అన్నారు. వినియోగదారుల ఉద్యమం ప్రజల్లో తీసుకెళ్లాలన్నారు. జెడ్పీ సీసీఓ వెంకటరెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేష్, జిల్లా తూనికలు, కొలతల అధికారి రవీందర్ పాల్గొన్నారు
పాలమూరు యూనివర్సిటీలో..
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. అధ్యాపకుడు అర్జున్‌కుమార్ మాట్లాడుతూ వ్యాపార దోపిడీ, మోసపూరిత కాల్స్, ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధ్యాపకులు నాగసుధ, జావీద్ అహ్మద్, అరుంధతిరెడ్డి పాల్గొన్నారు.
గుల్బర్గాలోని డంపింగ్ యార్డు పరిశీలన
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: తడి, పొడి చెత్తను పూర్తిస్థాయిలో రీసైక్లింగ్ చేసే కన్వేయర్ బెల్ట్ యంత్రాన్ని మున్సిపల్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. దీనికోసం కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా మున్సిపాలిటీ పరిధిలోని ఈ ప్లాంటును సందర్శించారు. అక్కడ ఆ యంత్రం పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని తిరిగి వచ్చారు. అయితే ఈ ప్లాంటు ఏర్పాటుకు కనీసం రూ.80 లక్షలు వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేశారు. వాస్తవానికి మహబూబ్‌నగర్ పట్టణంలోని డంపింగ్ యార్డులో ప్రతినిత్యం వంద మెట్రిక్ టన్నుల చెత్త వస్తుంది. ఈ యంత్రం ద్వారా 60 మెట్రిక్ టన్నులు ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేయవచ్చు. దీనిని ఇక్కడే ఏర్పాటు చేస్తే నిర్వహణ బాధ్యతలు తామే చూసుకుంటామని శ్రీ సిమెంట్ లిమిటెడ్ యాజమాన్యం ముందుకు వచ్చింది. దీని ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు గురులింగం, వజ్రకుమార్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిలకడగా ఉల్లి ధర
దేవరకద్ర: స్థానిక మార్కెట్‌లో ఽఉల్లి ధరలు నిలకడగా ఉన్నాయి. గత వారం వచ్చిన ధరలే ఈ వారం నమోదయ్యాయి. బుధవారం క్రిస్మస్ సెలవు కావడం వల్ల ఒక రోజు ముందుగానే ఉల్లిపాయల బహిరంగ వేలం నిర్వహించారు. బహిరంగవేలంలో ఉల్లి ధర గరిష్టంగా రూ.3,610, కనిష్టంగా రూ.3,100 పలికింది. కాగా.. మధ్యాహ్నం జరిగిన ఈ టెండర్లలో కందులు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,219, కనిష్టంగా రూ.7159, ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,569గా ఒకే ధర లభించింది. క్రిస్మస్, బాక్సింగ్ డే సందర్భంగా మార్కెట్‌కు రెండు రోజుల పాటు సెలవు ఉంటుందని, తిరిగి ఈ నెల 27న లావాదేవీలు జరుగుతాయని మార్కెట్ కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు.
● అడిషనల్ కలెక్టర్ మోహన్‌రావు
Comments
Please login to add a commentAdd a comment