ఉరేసుకొని వ్యక్తి బలవన్మరణం
వెల్దండ: పశువుల షెడ్‌లో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మండలంలోని తిమ్మినోనిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. తిమ్మినోనిపల్లి పరిధిలోని రాచూర్‌తండాకు చెందిన మూడావత్ రవినాయక్(45) ఉదయం9గంటలకు భోజనం చేసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లాడు. పశువుల షేడ్‌లో రవినాయక్ ఉరేసుకున్న విషయం సమీప పొలం రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే మృతి చెందినట్లు గమనించారు. రవినాయక్‌కు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment