కోయిల్‌సాగర్ పరిధిలోని ఆయకట్టుకు నేటి నుంచి సాగునీటిని వదలనున్నారు.
నేడు అయ్యప్పకొండపై మహాపడి పూజ
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని అయ్యప్ప కొండపై బుధవారం 27వ వార్షికోత్సవ అయ్యప్పస్వామి మహాపూజ నిర్వహించనున్నారు. ఈ మేరకు అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి 8.30 గంటల వరకు సుప్రభాత సేవ, గణపతి, నవగ్రహ హోమం, నిత్యాభిషేకం, అనంతరం స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 10 గంటలకు స్థానిక తూర్పు కమాన్ వద్ద గల రామాలయం నుంచి కలశ, స్వామి వారి పల్లకీ సేవ ప్రారంభమై పట్టణ ప్రధాన రహదారుల మీదుగా అయ్యప్పకొండ ఆలయం వరకు కొనసాగుతుంది. అష్టాభిషేకం పూజల అనంతరం, మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 గంటలకు తిరుపతికి చెందిన వెంకటేశ్వర చంద్రమౌళి శర్మ, పాలమూరు పట్టణ గురుస్వాముల ఆధ్వర్యంలో ఏకశిల దివ్య పదునెట్టాంబడి, మహా మంగళహారతి పూజలు నిర్వహించనున్నారు.
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉదయం, రాత్రి చలిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండగా ఉంటుంది.
అంబేడ్కర్ చిత్రపటాలతో ర్యాలీ చేస్తున్న వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనిరుధ్, యెన్నం, జీఎమ్మార్
Comments
Please login to add a commentAdd a comment