దోమలపెంట: భూగర్భ కేంద్రంలో పంప్‌మోడ్ పద్ధతిలో శ్రీశైలం ఆనకట్ట దిగువన సాగర్ జ లాశయం నుంచి ఆనకట్ట ఎగువన శ్రీశైలం జలాశయంలోకి 24 గంటల వ్యవధిలో 2,632 క్యూసెక్కుల నీటిని(ఎత్తిపోతల) తరలించారు. పోతిరెడ్డిపాడు ద్వారా 1,500 క్యూసెక్కులు, ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు 1,630, ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్‌కు 245, రేగుమాన్‌గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకి 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 3.063 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. మంగళవారం శ్రీశైలం జలాశయంలో నీటిమ ట్టం 862.3 అడుగుల వద్ద 113.2228 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
జూరాలకు స్వల్ప ఇన్‌ఫ్లో
ధరూరు: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లోలు కొనసాగుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 1,262 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 90 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 493 క్యూసెక్కులు, కుడి కాల్వకు 285 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 195 క్యూసెక్కు లు, భీమా లిఫ్టు–2కు 27 క్యూసెక్కులు, ప్రా జెక్టు నుంచి మొత్తం 1,713 క్యూసెక్కుల నీటి ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూ ర్తిస్థాయి నీటిమట్టం 9.657టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 8.241 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు.
నల్లబెల్లం పట్టివేత
అచ్చంపేట రూరల్: నిషేధిత నల్లబెల్లంను పట్టుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ కృష్ణ తెలిపారు. సోమవారం అర్ధరాత్రి మండలంలోని హాజీపూర్ చౌరస్తాలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నల్లబెల్లం సరఫరా చేస్తున్న కారును ఆపి తనిఖీచేయగా డ్రైవర్ పరారయ్యాడు. కారులో ఉన్న 16బస్తాల నల్లబెల్లం, 50కిలోల పటిక, 6లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment