బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్‌పల్లి సర్వే నంబర్ 523లో పట్టా స్థలాలను కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని క్రిస్టియన్‌పల్లి నిర్వాసితుల కమిటీ నాయకుడు రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ప్రధాన గేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రిస్టియన్‌పల్లి శివారు 523 సర్వే నంబర్‌లో 2004, 2012లో అప్పటి ప్రభుత్వాలు పేదలకు ఇంటి స్థలాలు కేటాయిస్తూ.. పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్‌బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పి, పట్టాదారులకు 2018లో అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో రశీదులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. నాటి నుంచి డబుల్‌బెడ్రూం ఇళ్ల కోసం 400 మంది పేదలు ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఏనుగొండ శివారు మౌలాలిగుట్ట వద్ద నిర్మించిన డబుల్‌బెడ్రూం ఇళ్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నిర్వాసితుల కమిటీ పట్టణ గౌరవాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, అధ్యక్షురాలు పార్వతమ్మ, ప్రధాన కార్యదర్శి ఎం.మంగమ్మ, వహీదాబేగం, అనురాధ, సైదాబేగం, భార్గవి, గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment