మహబూబ్‌నగర్ క్రీడలు: కల్వకుర్తి పట్టణంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి క్రాస్‌కంట్రీ పరుగు పోటీల్లో జిల్లా క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబరిచారు. మహిళల 10 కిలోమీటర్ల పరుగును మహేశ్వరి 41 నిమిషాల్లో పూర్తిచేసి వెండి పతకం, 20 ఏళ్లలోపు బాలుర విభాగంలో శివకుమార్ 8 కిలోమీటర్ల పరుగును 27 నిమిషాల్లో పూర్తి చేసి కాంస్య పతకం సాధించారు. 20 ఏళ్లలోపు బాలుర విభాగంలో జిల్లా క్రీడాకారులు టీం చాంపియన్‌షిప్‌లో మూడో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా వారిని డీవైఎస్‌ఓ ఎస్.శ్రీనివాస్, జిల్లా అథ్లెటిక్స్ సంఘం సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఉపాధ్యక్షులు రాజేంద్రకుమార్ ప్రోత్సాహకంగా నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి జి.శరత్‌చంద్ర, కోచ్‌లు ఆనంద్, శ్రీనివాస్, సునీల్, పీడీలు శ్రీనివాస్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment