మహబూబ్‌నగర్ క్రైం: విద్యార్థుల మధ్యలో జరిగిన చిన్నపాటి ఘర్షణ చివరకు కొట్టుకునే స్థాయి వరకు వెళ్లింది. ఓ విద్యా సంస్థ నిర్వాహకులు ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని బ్రాంచ్‌లకు కలిపి జోనల్ స్పోర్ట్స్ ఈవెంట్‌ను సోమవారం స్టేడియం మైదానంలో నిర్వహించారు. అయితే సోమవారం రాత్రి విజేత టీంలకు ట్రోఫీలు అందించే క్రమంలో విన్నర్ జట్లు సంబరాలు చేసుకునే క్రమంలో ఇరుజట్ల విద్యార్థుల మధ్య మాటమాట పెరిగింది. ఈ క్రీడల్లో బయటి వారిని తీసుకువచ్చి ఆడించారని ఓడిన జట్టు ఆరోపించగా ఈ విషయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగి కొట్టుకున్నారు. ఘటన స్థలానికి టూటౌన్ పోలీసులు వెళ్లి అదుపు చేశారు. ఈ విషయంపై టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్‌ను వివరణ కోరగా ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment