మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
పాలమూరు: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో బీజేపీ నాయకులు పనిచేయాలని ఎంపీ డీకే అరుణ సూచించారు. కార్పొరేషన్ ఏర్పాటు సమయంలో వార్డుల విభజన అంశంపై ఆమె బుధవారం జిల్లాకేంద్రంలో పార్టీ నాయకులతో సమీక్షించారు. మున్సిపల్ వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభం కార్యక్రమంలో స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడం లేదని.. అధికారుల తీరును నాయకులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. బీజేపీ సంస్థాగతంగా బలోపేతం కోసం పట్టణాన్ని నాలుగు విభాగాలుగా విభజించి అధ్యక్షులను నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు నాగలిగారి రమేష్, పద్మజారెడ్డి, వీరబ్రహ్మచారి, కృష్ణవర్ధన్‌రెడ్డి, కె.రాములు, పాండురంగారెడ్డి, అంజయ్య, రామాంజనేయులు, చెన్న వీరయ్య, క్రిష్ణనాయక్, కొండయ్య, సతీష్‌కుమార్, బుడ్డన్న, యాదయ్య, నిరంజనమ్మ, వేణమ్మ, బాలీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment