ఏ గ్రేడ్ సాధిస్తే ప్రయోజనం..
యూనివర్సిటీకి ప్రస్తుతం బీ గ్రేడ్ ఉంది. దీన్ని అధిగమించి ఏ గ్రేడ్ సాధించేందుకు కృషి చేస్తు న్నాం. మూడు రోజుల పాటు న్యాక్ బృందం పీయూను సందర్శించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. గ్రేడ్ పెరిగితే మరిన్ని నిధులు రావడంతో పాటు యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. వారి సర్టిఫికెట్‌పై గ్రేడ్ ముద్రిస్తాం. మంచి గ్రేడ్ ఉంటే విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – జీఎన్ శ్రీనివాస్, వైస్ చాన్స్‌లర్, పీయూ
సమష్టిగా ముందుకు..
ఆరుగురు సభ్యులతో కూడిన న్యాక్ బృందం పీయూను సందర్శించనుంది. వారు అకాడమిక్ యాక్టివిటీస్, రీసెర్చ్, స్పోర్ట్స్, క్యాంపస్ రిక్రూట్‌మెంట్ మొదలుకొని చెక్‌బుక్కులు, రికార్డులు, అటెండెన్స్ వంటి వాటన్నింటినీ పరిశీలిస్తారు. గతం కంటే వసతులు పెరిగిన నేపథ్యంలో ఏ గ్రేడ్ వస్తుందని భావిస్తున్నాం. టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది సమష్టి కృషితో అన్ని పనులు పూర్తిచేశాం. – చెన్నప్ప, రిజిస్ట్రార్, పీయూ
పూర్తి వివరాలు సమర్పిస్తాం..
గతంలోనే న్యాక్‌కు ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలు అందించాం. ఇందుకు సంబంధించి విచారణకు వచ్చే కమిటీ సభ్యులకు అన్ని వివరాలు సమర్పిస్తాం. మూడు రోజులపాటు పీయూ కళాశాలలు, పీజీ సెంటర్లను తనిఖీలు చేయనున్న నేపథ్యంలో అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. మంచి గ్రేడింగ్ సాధించి పీయూ విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు కృషిచేస్తాం. – మధుసూదన్‌రెడ్డి, ఐక్యూఏసీ డైరెక్టర్, పీయూ
●
Comments
Please login to add a commentAdd a comment