![నేటి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07mbnrl852-210066_mr-1738954815-0.jpg.webp?itok=L2ksbwa8)
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని సింహగిరి కొత్తగంజ్ శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉత్స వాల్లో భాగంగా తొలిరోజు శనివారం సుదర్శన నారసింహ హోమం, 9న ధ్వజారోహణం, 10న ఎదుర్కోళ్ల ఉత్సవం, 11న స్వామివారి కల్యాణోత్సవం, 12న శ్రీస్వామివారి రథోత్సవం, 13న చక్రతీర్థం, సహస్ర కలశాభిషేకం తదితర కార్యక్రమంలో నిర్వహించనున్నారు. భక్తులు ఉత్సవాల్లో పాల్గొనాలని విజయవంతం చేయాలని ఆలయ సుందరీకరణ కమిటీ అధ్యక్షుడు పోల శ్రీనివాసులు తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: దేవరకద్ర మండలకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామ ర్స్ సబ్జెక్టు బోధించేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఎంవీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెట్, సెట్, పీహెచ్‌డీ వంటి అర్హతలు గల అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ లోగా దేవరకద్ర డిగ్రీ కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
‘స్థానిక’ పోరులో
కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతాం
మహబూబ్‌నగర్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం కులగణనలో బీసీలను తగ్గించి తప్పుడు లెక్కలు చూపుతోందని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ది చెప్పాలని తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాండుయాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన సర్వేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని.. ఈ అంశాన్ని గ్రామస్థాయి వరకు చేర్చాలని కోరారు. కులగణనతో బీసీలను అణచివేసే కుట్రకు కాంగ్రెస్ తెరలేపిందని, ఇదే సమయంలో ఓసీ జనాభాను పెంచి చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 ఏళ్లకుపైగా అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తూ ఓటుబ్యాంకుగా వాడుకుంటున్నాయని తెలిపారు. బీసీ విద్యావంతులు, యువత, మహిళలు, అన్నిరంగాల్లో ఉండే ప్రముఖులు ఆలోచించి బీసీలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. అగ్రకుల రాజకీయ పార్టీలను అర్థం చేసుకొని బీసీలే ఓ రాజకీయ శక్తిగా ఆవిర్భావించి స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. బీసీల జనాభా 60 శాతానికి పైగా ఉందని.. మనవే ఓట్లు, మనవే సీట్లు, మనదే రాజ్యాధికారం దిశగా అడుగులు వేద్దామని కోరారు. సమావేశంలో మహిళా విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి సంధ్యారాణి, చంద్రకళ, హర్షవర్ధన్, సాయిదత్తు, అరుణ్‌కుమార్, రవికుమార్, శ్రీనివాస్, ఆంజనేయులు, మణికంఠ పాల్గొన్నారు.
![నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07mbnrl303-210062_mr-1738954815-1.jpg)
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment