![రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07zcl03-210041_mr-1738954816-0.jpg.webp?itok=etkcD-7c)
రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం
జడ్చర్ల: రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్ హయాంలో కొందరు ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములను పట్టాలు చేసుకోవడంతో ఆదివాసీ రైతులకు అన్యాయం జరిగి రోడ్డున పడ్డారని, వారికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన జడ్చర్లలో విలేకరులతో మాట్లాడారు. ఓ సినిమాలో సమస్యను జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా చేసేందుకు తాగునీటి పైపులైన్లలోకి దిగి మీడియా దృష్టిని ఆకర్షించడంతో సమస్య బయటకు వస్తుందని, అలాగే మీడియా ఈ సమస్య ఎక్కడుందో బయటకు తీసి బాధిత రైతులకు న్యాయం చేసేందుకు కృషిచేయాలని కోరారు. హైదరాబాద్‌లో ఇటీవల తాము ఓ హోటల్‌లో తోటి ఎమ్మెల్యేలతో కలిసి డిన్నర్ చేసిన సంఘటన వాస్తవమన్నారు. నియోజకవర్గ సమస్యలు, నిధులు తదితర అంశాలపై చర్చించామని, సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి నిధులను కోరడం గురించి మాట్లాడామన్నారు. మీడియా తమపై దృష్టి సారించడం మానేసి భూ అక్రమాలను వెలికి తీయాలని హితవు పలికారు. అలాగే ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసిత రైతుల సమస్యలపై మాట్లాడామని, వారికి ఆర్‌అండ్‌ఆర్ పరిహారం పెంపు తదితర వాటిపై చర్చ జరిగిందన్నారు.
● ఉదండాపూర్ నిర్వాసితులకు న్యాయం చేసేందుకు అహర్నిషలు కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఉదండాపూర్ నిర్వాసితులు కలిసి తమ ఇబ్బందులను వివరించారు. సంబంధిత అధికారులకు నిర్వాసితులు సహకరించాలని, సర్వే చేసి నివేదిక ఇస్తేనే తాను ప్రభుత్వంతో పోరాడేందుకు అవకాశం ఉంటుందన్నారు. సర్వేకు అవరోధం కలిగిస్తే ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. అవార్డు పాసయితేనే త్వరగా పరిహారం ఇచ్చేందుకు వీలవుతుందన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హులను గుర్తించడంలో ఇందిరమ్మ కమిటీలే కీలకమని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment