గ్యారంటీల పేరుతో కాంగ్రెస్‌ మోసం | Sakshi
Sakshi News home page

గ్యారంటీల పేరుతో కాంగ్రెస్‌ మోసం

Published Tue, May 7 2024 12:15 AM

గ్యారంటీల పేరుతో కాంగ్రెస్‌ మోసం

● పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌

చెన్నూర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని పెద్దపల్లి లోక్‌సభ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. సోమవారం రాత్రి చెన్నూర్‌ పట్టణంలోని జలాల్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి ప్రధాన రహదారులు, వ్యాపార సముదాయాల్లో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డలకు రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఆరు నెలలైన అడ్రస్‌ లేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాంలాల్‌గిల్డా, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఆదరించండి

బెల్లంపల్లి: పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని సింగరేణి కార్మికులు ఆదరించాలని పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ కోరారు. సోమవారం మందమర్రి ఏరియా శాంతిఖని గని ఆవరణలో నిర్వహించిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ప్రజా, కార్మి క సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ ఎన్నికల్లో మరిన్ని కొత్త హామీలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఆగర్భ శ్రీమంతుడై న కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణతో తలపడుతున్న తా ను సాధారణ వ్యక్తినని పేర్కొన్నారు. బెల్లంపల్లి మండలం బుధాకలాన్‌ గ్రామానికి వెళ్లి ఉపాధి హా మీ కూలీలు, బెల్లంపల్లి కాంటా చౌరస్తా, బజారు ఏ రియా ప్రాంతంలో ప్రచారం చేసి పుర ప్రజలు, కూ రగాయల వ్యాపారులతో ముచ్చటించారు. ఈ కా ర్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ టి.సత్యనారాయణ, బీఆర్‌ఎస్‌, టీ బీజీకేఎస్‌ నాయకులు కొప్పుల లక్ష్మణ్‌, గణేష్‌, బడికెల సంపత్‌, మేడిపల్లి సంపత్‌, బడికెల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement