ఇంచార్జీ డీసీఎస్వోగా హరికృష్ణ
మంచిర్యాలఅగ్రికల్చర్: ఇంచార్జీ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి(డీసీఎస్వో)గా బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ బుధవారం జిల్లా పౌరసరఫ రాల శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గత కొన్ని నెలల క్రితమే జిల్లాకు వ చ్చిన జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వాజి ద్ అలీ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈ నె ల 12న రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ డీఎస్ చౌహన్ సస్పెండ్ చేశారు. ఇంచార్జీ బాధ్యతలు బెల్లంపల్లి ఆర్డీవోకు అప్పగించారు.
నేడు బీఆర్ఎస్ నిరసన
చెన్నూర్: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ తెలిపారు. రైతాంగానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించి నేడు సన్న వరి ధాన్యం వేసిన రైతులకు మాత్రమే ఇస్తామని ప్రకటించడం దారుణమని పేర్కొన్నారు. రైతులు, రైతు సమన్వయ సమితి జిల్లా, నియోజకవర్గ, మండల అధ్యక్షులు, కార్యదర్శులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment