ఖోఖో చాంపియన్ ఆదిలాబాద్
● రెండు విభాగాల్లోనూ సత్తాచాటిన జట్లు ● ముగిసిన రాష్ట్ర స్థాయి ఖోఖో టోర్నీ
మహబూబ్‌నగర్‌క్రీడలు: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో 43వ రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లా జూనియర్ ఖోఖో పోటీలు బుధవారం ముగిశాయి. టోర్నీలో బాలుర, బాలికల విభాగాల్లో ఆదిలాబాద్ జట్లు చాంపియన్‌షిప్‌లను కై వసం చేసుకున్నాయి. బాలుర విభాగం రన్నరప్‌గా రంగారెడ్డి, బాలికల రన్నరప్‌గా నల్గొండ జట్లు నిలిచాయి. బాలుర విభాగం మూడు, నాల్గు స్థానాల్లో వరంగల్, మెదక్, బాలికల్లో హైదరాబాద్, రంగారెడ్డి జట్లు నిలిచాయి.
ఉత్కంఠంగా బాలుర ఫైనల్
ఆదిలాబాద్–రంగారెడ్డి జట్ల మధ్య బాలుర విభాగం ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. చివరి వరకు మ్యాచ్‌లో ఆదిలాబాద్ జట్టు 38–36 పాయింట్ల తేడాతో రంగారెడ్డి జట్టుపై విజయం సాధించింది. బాలికల ఫైనల్ మ్యాచ్‌లో ఆదిలాబాద్ జట్టు 20–16 పాయింట్ల తేడాతో నల్గొండపై గెలుపొందింది. అనంతరం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విజేత జట్లకు ట్రోపీలు, మెడల్స్ అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment