తండ్రి మృతి.. కుమారుడి నిరసన
బెల్లంపల్లి: డ్రెయినేజీని మూసివేయడంతో వచ్చిన దుర్వాసన వల్లే తన తండ్రి, సింగరేణి రిటైర్డు కా ర్మికుడు దయానంద్ ప్రసాద్ పాండే (82) మృతి చెందాడని కల్యాణ్పాండే బుధవారం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలి పాడు. వివరాల్లోకి వెళ్తే.. మున్సిపాలిటీలోని 29వ వార్డు బజారు ఏరియా డబ్బుసేట్లైన్లో దయానంద్ప్రసాద్ పాండే నివాసం ఉంటున్నాడు. ఈక్రమంలో వీధి లోని డ్రెయినేజీని తాత్కాలికంగా మున్సి పల్ సిబ్బంది మూసివేశారు. దీంతో మురికి కాలువలో నీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతుండగా, దు ర్వాసనతోనే తన తండ్రి దయానంద్ప్రసాద్ పాండే మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడని, డ్రెయినేజీని మూసి ఉంచిన వారిపై చర్యలు తీసుకోవాలని కల్యాణ్పాండ్ ప్లకార్డు పట్టుకుని ఆందోళన చేశాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కల్యాణ్పాండే ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment