● పురుగుల మందు తాగిన అన్నదమ్ములు ● అన్న మృతి.. చికిత్
దండారీ వేళ కుటుంబంలో విషాదం
జైనూర్: ఏజెన్సీ ప్రాంతాల్లో దండారీ ఉత్సవాలు ఘనంగా జరుగుతుండగా మండలంలోని గూడమామడ గ్రామానికి చెందిన ఒక కుటుంబంలో మాత్రం విషాదచాయలు అలుముకున్నాయి. దండారీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు సిద్ధమైన ఇద్దరు అన్నదమ్ములు చిన్న గొడవతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గూడమామడ గ్రామానికి చెందిన మర్సుకోల గంగారాంకు ఇద్దరు కుమారులు న్యానేశ్వర్, శంకర్ ఉన్నారు. గూడమామడ గ్రామానికి చెందిన దండారీ సోనాపూర్‌కు వెళ్తుండగా వీరిద్దరు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈక్రమంలో ఇంట్లో ఉన్న పశువులను మేతకు తీసుకెళ్లేందుకు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా మనస్తాపానికి గురైన వీరు మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఇంటి ఆవరణలో వాంతులు చేసుకోవడంతో గమనించిన తండ్రి ఉట్నూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే మర్సుకోల న్యానేశ్వర్(24) మృతి చెందగా, మెరుగైన వైద్యం కోసం మర్సుకోల శంకర్‌ను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాగర్ బుధవారం తెలిపారు.
వృద్ధుడి ఆత్మహత్య
కౌటాల: మండలంలోని ముత్తంపేట గ్రామానికి చెందిన సర్వర్ లాలూ(59) అనే వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మధుకర్ బుధవారం తెలిపారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలూ మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు సిర్పూర్(టి) ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడు నితిన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment