పోరాట యోధుడు భీం
● ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ ● భీంపూర్‌లో కుమురంభీం విగ్రహావిష్కరణ
తాంసి: ఆదివాసీ గిరిజన హక్కుల కోసం పోరాడిన మహనీయుడు కుమురంభీం అని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. భీంపూర్ మండల కేంద్రంలో ఏర్పా టు చేసిన కుమురంభీం విగ్రహాన్ని ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జుతో కలిసి బుధవారం ఆవి ష్కరించారు. ఈ సందర్భగా ఎంపీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. భీంపూర్ మండలంలోని కరంజి(టి) నుంచి మహారాష్ట్ర వరకు అంతర్రాష్ట రహదారిని పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ భోజా రెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు రాజు, సుధాకర్, కుమురం భీం విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment