డెంగీ దినోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ
మంచిర్యాలటౌన్: జాతీయ డెంగీ దినోత్సవం పోస్టర్లను బుధవారం విడుదల చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఇంచార్జీ డీఎంహెచ్‌వో డాక్టర్ అనిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్‌చంద్రరెడ్డి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంచార్జీ డీఎంహెచ్‌వో మాట్లాడుతూ డెంగీ నివారణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ప్రతీ గ్రామం, పట్టణ ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని కోరారు. డెంగీపై ప్రతీరోజు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బందికి అవగాహన కల్పించడం తప్పనిసరి అన్నారు. జిల్లాలోని అన్ని ఆశ్రమ పాఠశాలలు, ఇతర హాస్టళ్లలో దోమల మందు పిచికారీ చేయించామని, దోమల నివారణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ కిట్లు అందుబాటులో ఉంచామని, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎలిజా పరీక్ష ద్వారా డెంగీని పూర్తిగా నిర్ధారించేందుకు సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ ఏడీ ఇస్మాయిల్, డీఎంహెచ్‌వో కార్యాలయ సూపరింటెండెంట్ విశ్వేశ్వర్‌రెడ్డి, నామ్‌దేవ్, సత్యనారాయణ, సంతోష్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment