ప్రథమ చికిత్స కేంద్రాల్లో తనిఖీ | Sakshi
Sakshi News home page

ప్రథమ చికిత్స కేంద్రాల్లో తనిఖీ

Published Thu, May 16 2024 2:20 PM

-

మందమర్రిరూరల్‌: మందమర్రి పట్టణంలోని పలు పీఎంపీ, ఆర్‌ఎంపీ ఆస్పత్రులు, ప్రథమ చికిత్స కేంద్రాల్లో తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ విజిలెన్స్‌ అధికారుల బృందం బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. పాలచెట్టు, మార్కెట్‌ ఏరియాల్లో రోగులకు ఎలాంటి వైద్యం అందిస్తున్నారు, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయనే విషయాలపై ఆరా తీశారు. అనుమతి లేకుండా వైద్యం అందించే పీఎంపీ, ఆర్‌ఎంపీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని సూచించారు.

నమూనా పరీక్షలకు రిజిస్ట్రేషన్‌

మంచిర్యాలటౌన్‌: టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌, యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలి మ్స్‌ నమూనా పరీక్షల కోసం అభ్యర్థులు రి జిస్ట్రేషన్‌ చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి వినోద్‌కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని అభ్యర్థులకు నమూనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రూప్‌–1 నమూనా పరీక్షలను ఆదిలాబాద్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఈ నెల 18, 20, 22, 24, 25, 27, 29, 31, జూన్‌ 1, 3 తేదీల్లో, సివిల్‌ సర్వీసెస్‌ నమూనా పరీక్షలను హైదరాబాద్‌లో ఈ నెల 23, 26, 28, 30, జూన్‌ 2, 4, 6, 8, 10, 12 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో https:// tsbcstudycircle. cgg. gov. in/ firstpage. do వెబ్‌సైట్‌ ద్వారా సమర్పించాలని, వివరాలకు 08732–221280 నంబరులో సంప్రదించాలని తెలిపారు.

దాడి చేసిన పలువురిపై కేసు

ఆదిలాబాద్‌రూరల్‌: మావల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పిట్టల్‌వాడకు చెందిన జాదవ్‌ గోపాల్‌పై దాడి చేసిన పలువురిపై కేసు నమోదు చేసిన్నట్లు ఎస్సై విష్ణు వర్ధన్‌ తెలిపారు. పిట్టల్‌వాడకు చెందిన జాదవ్‌ గోపాల్‌ బుధవారం దుర్గనగర్‌ కాలనీ నుంచి ద్విచక్ర వాహనంపై పిట్టల్‌వాడకు వస్తుండగా 170 కాలనీకి చెందిన అజయ్‌ మహకాల్‌తో పాటు పలువురు కర్రలు, రాడ్లతో దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అజయ్‌తో పాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement