ప్రాణం తీసిన రాంగ్‌రూట్
ఆసిఫాబాద్‌అర్బన్: గమ్య స్థానాన్ని త్వరగా చేరుకోవాలనే ఆత్రుతతో రాంగ్‌రూట్‌లో ప్ర యాణించిన ద్విచక్ర వాహనదారుడు ప్రా ణాలు పోగొట్టుకొన్నాడు. సీఐ రవీందర్ తెలి పిన వివరాల ప్రకారం కాగజ్‌నగర్ మండలం వంజిరి నందిగూడకు చెందిన గుర్లె మొ ండయ్య శనివారం మధ్యాహ్నం ద్విచక్ర వా హనంపై వంజిరి గ్రామానికి చెందిన మంతెన ప్రభాకర్‌తో కలిసి రాంగ్ రూట్‌లో వెళ్తు ండగా జిల్లా కేంద్రంలోని ఫారెస్టు చెక్‌పోస్టు సమీపంలో కారు ఢీకొట్టింది. మొండయ్యకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రభాకర్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment