రైతులు ఆందోళన చెందొద్దు
చిన్నశంకరంపేట(మెదక్): రైస్‌మిల్లర్ల సమస్యను పరిష్కరించి ఒకటి, రెండు రోజుల్లో ధాన్యం కాంటా చేస్తామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. సోమవారం నార్సింగి మండలం సంకాపూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. జిల్లాలో 475 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ షేక్ కరీం, ఎంపీడీఓ ఆనంద్, ఐకేపీ ఏపీఎం ఆశోక్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్, నార్సింగి, చిన్నశంకరంపేట మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ, శ్రీనివాస్‌గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు
Comments
Please login to add a commentAdd a comment