ఊరెళ్తున్నారా.. జరభద్రం!
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
మెదక్ మున్సిపాలిటీ: సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నారా..? అయితే అప్ర మత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దూరప్రాంతాలకు వెళ్లే వారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నంబర్‌ను సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులకు తెలపాలన్నారు. వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసుకుని వారి ఇళ్లపై నిఘా పెడతామని తెలిపారు. ద్విచక్రవాహనాలు, కార్లు ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదని సూచించారు. టైమర్‌తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలన్నారు. బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని చెప్పా రు. కొత్త వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై 100 సమాచారం అందజేయాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment