మంజీరా తీరం.. మొసలి కలకలం
చిలప్‌చెడ్(నర్సాపూర్): చిలప్‌చెడ్ శివారులోని మంజీరా వాగు తీరంలో శుక్రవారం మొసలి కలకలం రేపింది. దానిని చూసిన పలువురు రైతులు, గొర్రెల కాపరులు భయాందోళనకు గురయ్యారు. మోటార్లు చెడిపోతే నదిలో దిగా ల్సి ఉంటుందని, మత్స్యకారులు సైతం చేపలు పట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు. సంబంధిత అధికారులు మొసళ్లను పట్టుకుని మంజీరా పరివాహక ప్రాంత రైతులకు భరోసాకల్పించాలని పలువురు కోరుతున్నారు.
నియామక పత్రం అందజేత
మెదక్‌జోన్ : కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలిగా దుర్గాభవానీ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు చేతుల మీదుగా నియామకపత్రాన్ని అందుకున్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయనని ఆమె స్పష్టం చేశారు.
వందశాతం ఉత్తీర్ణతసాధించాలి
శివ్వంపేట(నర్సాపూర్): పదో తరగతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ రాధాకిషన్ అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్దగొట్టిముక్ల, పాంబండ ఉన్నత పాఠశాలలతో పాటు గూడూర్ కేజీబీవీ వసతిగృహన్ని తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనంతో పాటు విద్యా బోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, చదువులో వెనుకబడిన విద్యార్థుల ప ట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతుల నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈఓ బుచ్చనాయక్, హెచ్‌ఎంలు శ్రీధర్‌రావు, ఇందుమతి తదితరులు ఉన్నారు.
స్వామి వివేకానందకునివాళులు
రాయాయంపేట(మెదక్): స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రామాయంపేటలో శుక్రవారం విద్యార్థులు, ఏబీవీపీ ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిద్దిపేట, మెదక్ జిల్లాల సంఘటనా మంత్రి లక్ష్మీపతి, నాయకులు బండారి ప్రశాంత్, హరిహర, సంయుక్త కార్యదర్శి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్‌లో
చిరుత సంచారం!
రేగోడ్(మెదక్): మండలంలోని తిమ్మాపూర్ వ్యవసాయ పొలాల్లో చిరుత పులి సంచరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మా పూర్ శివారులోని పొలాల్లో పలువురు రైతులు గురువారం సాయంత్రం పనులు చేస్తుండగా చిరుత వెలుతూ కనిపించింది. సమీపంలో తాగునీరు అందుబాటులో ఉండడంతో వెల్లినట్లు అనుమానిస్తున్నారు. ఈ విషయం బయటకు తెలియడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై పెద్దశంకరంపేట అటవీశాఖ రేంజ్ అధికారి వికాస్, బీట్ ఆఫీసర్ రమేశ్‌ను వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment