ముక్కోటి ఏకాదశి జిల్లాలో కనులపండువగా సాగింది. శుక్రవారం ఉత్తర ద్వార దర్శనంతో దేవతామూర్తులను దర్శించుకొని భక్త కోటి పులకించింది. చలిని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. జిల్లా కేంద్రంలోని కోదండరామాలయం, వేంకటేశ్వర ఆలయం, హనుమంతరావు కాలనీలో గల మరకత లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున కోదండ రామాలయంలో స్వామివారికి పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం ఉత్తరద్వారం తెరిచారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణాలన్నీ హరినామస్మరణలతో మార్మోగాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కోదండ రామాలయంలో మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి దంపతులు, అదనపు కలెక్టర్ నగేష్ పూజల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. – మెదక్ మున్సిపాలిటీ
Comments
Please login to add a commentAdd a comment