పశువులకు వ్యాధులు సోకకుండా చూసుకోవాలి
● జిల్లా పశువైద్య సహాయ
సంచాలకులు తిరుపతి
మనోహరాబాద్(తూప్రాన్): పశువులకు గాలికుంటు, గర్భకోశ, సీజనల్ వ్యాధులు రాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశువైద్య సహాయ సంచాలకులు తిరుపతి సూచించారు. సోమవారం మండలంలోని వెంకటాపూర్ అగ్రహారంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. జీవాలకు వివిధ వ్యాధులు, గర్భకోశ వ్యాధులను గుర్తించారు. 50 ఆవులు, 40 గేదెలకు చికిత్స చేశారు. గాలికుంటు వ్యాధులు రాకుండా టీకాలు వేశారు. కార్యక్రమంలో తూప్రాన్ ఉమ్మడి మండల పశువైద్యురాలు లక్ష్మి, వైద్యులు గోపాలమిత్ర పర్యవేక్షకుడు సత్యనారాయణ, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment