లక్ష్మీనర్సింహస్వామి వార్షికోత్సవం
● హాజరైన మంత్రి దామోదర
అల్లాదుర్గం(మెదక్): మండల కేంద్రంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయ వార్షికోత్సవం సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణతో హోమం, గణపతి పూజ, అభిషేకం చేశారు. మహిళలు స్వామివారికి బోనాలు సమర్పించారు. వేడుకలో పాల్గొని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనకు ఆలయ పూజారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లయ్య, సీఐ రేణుకారెడ్డి, కాంగ్రెస్ నాయకులు బల్‌రాం, నర్సింహరెడ్డి, సదానందం, బాల్‌రాజ్ , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి వాలీబాల్‌బాలుర విజేత ఖమ్మం
● బాలికల విభాగంలో నిజామాబాద్
చేగుంట(తూప్రాన్): అండర్ 14 వాలీబాల్ బాలబాలికల రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా.. బాలుర విభాగంలో ఖమ్మం జట్టు, బాలికల విభాగంలో నిజామాబాద్ జట్టు నిలిచింది. మండలకేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఈ పోటీలు సోమవారంతో ముగిశాయి. బహుమతుల ప్రదానోత్సవానికి ఆర్డీఓ జయచంద్రారెడ్డి హాజరై విజేతలకు షీల్డ్‌లను అందజేశారు. కాగా, బాలుర విభాగంలో రంగారెడ్డి జిల్లా 2వ స్థానం, వరంగల్ జిల్లా 3వ స్థానం సాధించింది. బాలికల విభాగంలో మెదక్ బాలికల జట్టు రెండవ స్థానం, ఆదిలాబాద్ జిల్లా జట్టు మూడో స్థానం సాధించింది. అనంతరం ఆర్డీఓ మాట్లాడారు. జాతీయస్థాయి పోటీల్లోను విజయం సాధించాలని ఆకాంక్షించారు. వివిధ జిల్లాల నుంచి కోచ్ మేనేజర్లుగా 46 మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్‌జీఎఫ్ సెక్రటరీ రమేశ్, తహసీల్దార్ నారాయణ, మెదక్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పరంజ్యోతి, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ చంద్రకళ, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, రాష్ట్ర వాలీబాల్ అబ్జర్వర్లు సాయినాథ్, శ్రీనివాస్, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 80 అర్జీలు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో కలెక్టరేట్‌లో సోమవారం హెల్ప్‌డెస్క్ ద్వారా నిర్వహించిన ప్రజావాణికి 80 దరఖాస్తులు వచ్చాయి. అధికారులంతా సమగ్ర సర్వేలో ఉండటంతో ఇన్‌వార్డు అధికారులు స్వీకరించారు. వాటిని కలెక్టర్‌కు అందజేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment