క్వింటాలుకు 5 కిలోలు బొక్కేస్తుండ్రు
అడిగితే చెప్పడం లేదు
ధాన్యం బస్తాకు 43 కిలోల 300 గ్రాములు కాంటా వేస్తున్నారు. ఎందుకని అడిగితే సరైనా సమాధానం చెప్పడంలేదు. ఇష్టం ఉంటే కాంటా పెట్టు లేదంటే ఉరుకోమంటున్నారు. సన్నరకం వడ్లను రెండు కిలోలు ఎక్కువగా కాంటా వేస్తుండంతో క్వింటాలుకు ఐదు కిలోల నష్టపోతున్నాం.
– స్వామి, రైతు నార్సింగి
చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్ల తూకం వేసే విషయమై సిబ్బంది చేతివాటం చూపుతున్నారు. ఇదేమని రైతులు ప్రశ్నిస్తే కాంటా వేయకుండా ఇబ్బందులు పెడుతున్నారు. సోమవారం పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో సన్న రకం వడ్ల బస్తా 43 కిలోల 300 గ్రాములు కాంటా చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 41.300 గ్రాములు కాంటా వేయాల్సి ఉంది. కానీ నార్సింగి పీఏసీఎస్ సిబ్బంది రైతులకు నష్టం కలిగించేలా తూకం వేస్తున్నారు. 40 కిలోల బస్తాకు 2 కిలోలు ఎక్కువగా కంటా వేస్తున్నారని, క్వింటాకు 5 కిలోలు ఎక్కువగా కాంటా చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ షేక్ కరీం దృష్టికి తీసుకెళ్లగా పీఏసీఎస్ సీఈఓకు ఫోన్ చేసి అడిగానన్నారు. ఎక్కువగా కాంటా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
నార్సింగి పీఏసీఎస్‌లో
సిబ్బంది చేతివాటం
బస్తాకు వేయాల్సినకాంటా 41 కిలోలు
తూకం వేస్తుంది 43 కిలోలు
నిబంధనలకు పాతర
Comments
Please login to add a commentAdd a comment