చలి కాలం..పౌల్ట్రీ పదిలం పౌల్ట్రీ రంగానికి చలికాలంలో సహజంగా ఇబ్బందులెదురవుతాయి. సమస్యలనివారణకు వైద్యులు సలహాలు సూచనలుఅందిస్తున్నారు. వివరాలు 8లో u
● 2,701 మంది గైర్హాజరు ● హాజరు శాతం 53.27
మెదక్ కలెక్టరేట్: గ్రూప్–3 పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. 5,867అభ్యర్థులకు గాను 3,166 మంది హాజరు కాగా 2,701 మంది గైర్హాజరయ్యారు. హాజరు శాతం 53.96గా నమోదైంది. ఆదివారం జరిగిన పరీక్షలకు సైతం 2,683 మంది గైర్హాజరయ్యారు. హాజరు శాతం 54.27గా నమోదైంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం అభ్యర్థుల హాజరు శాతం తగ్గింది.
నర్సాపూర్‌లో
నర్సాపూర్: స్థానిక బీవీ రాజు ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన గ్రూప్3 పరీక్ష కేంద్రంలో అభ్యర్థులు పరీక్ష రాశారు. ఆర్‌డీఓ మహిపాల్, అడిషనల్ ఎస్పీ మహేందర్, తహసీల్దార్ శ్రీనివాస్, సీఐ జాన్‌రెడ్డిలు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. 5 నిమిషాలు ఆలస్యంగా హైదరాబాద్‌కు చెందిన అభ్యర్థి రాగా 9.30 గంటలకే గేటు మూసివేశామని, తామేమి చేయలేమని అడిషనల్ ఎస్పీ మహేందర్ తెలిపారు. ఇదిలా ఉండగా తల్లులు పరీక్షకు వెళ్లడంతో చిన్నపిల్లలను ఆడిస్తూ పలువురు కుటుంబసభ్యులు కన్పించారు.
Comments
Please login to add a commentAdd a comment