విధుల్లో నిర్లక్ష్యం సహించబోం
జిల్లా వైద్యాధికారి శ్రీరామ్
కొల్చారం(నర్సాపూర్): వైద్యం కోసం వచ్చే రోగులకు సరైన వైద్యం అందించే క్రమంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ ఆరోగ్య కేంద్రం సిబ్బందిని హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రోగుల వార్డులను పరిశీలించారు. ఇక్కడ అందుతున్న వైద్య సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఉచిత వైద్యసేవలను వినియోగించుకోవాలని కోరారు. ఆస్పత్రిలో వైద్యానికి సంబంధించి అవసరమైన అన్ని మందులు ఉన్నాయా అన్న విషయమై ఆరా తీయడంతో పాటు స్టాకు రిజిస్టర్‌ను పరిశీలించారు. అనంతరం అక్కడి వైద్య సిబ్బంది సమావేశమై వైద్యం కోసం వచ్చే వారి పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలన్నారు. అప్పుడే ఆరోగ్య కేంద్రానికి మంచి పేరు, అందుతున్న సేవలపైన ప్రజలకు నమ్మకం చేకూరుతుందన్నారు. జిల్లా ప్రోగ్రాం అధికారి నవీన్ కుమార్, ఆస్పత్రి వైద్యాధికారి రమేశ్, ఆయుష్ వైద్యాధికారి హర్ష, ఎంపీ హెచ్‌ఈఓ మదన్మోహన్, ఫార్మసిస్ట్ సరిత, పీహెచ్‌ఎన్ యేసుని, వైద్యసిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment